మ్యూజిక్: ప్రశాంత్ R విహారి
లిరిక్స్: అనంత శ్రీరామ్
సింగెర్స్: యజిం నిజార్, హరిణి
సమయమా..
అదేమిటంటే తొందరంతా ఆగుమా..
సమయమా..
మరింత హాయి పోగుజేయనీయమా..
చేతిలోనే చేతులెసుకున్న చోటులోన
చూపుతోటి చూపులల్లుకున్న దారిలోన
శ్వాసలోకి శ్వాస చేరుతున్న మాయాలోన
ఆనంద వర్ణాల సరిగమ
సమయమా, సమయమా, సమయమా
కదలకే.. క్షణమా..
జతపడే ఎదలలో మధురిమా..
వదులుకోకే వినుమా..
ఆ నింగి జాబిల్లిపై
ఏ నీటి జాడున్నాడో
నే చూడలేని అప్పుడే
ఈ నేల జాబిలిపై
సంతోష భాష్పాలని
చూస్తూ ఉన్నానే ఇపుడే
తనేనా సగంగా తనేనా జగంగా
స్వరాల ఊయలూగుతుండగా
ఏడేడు లోకాలు ఆరారు కాలాలు
ఆ తార తీరాలు ఆనంద గారాలు
విరిసి మురిసే వేళ
తీపి కురిసే వేళ
ఈ స్వప్న సత్యాన్ని
దాటేసి పోనీకు
సమయమా, సమయమా, సమయమా
కదలకే క్షణమా
జతపడే ఎదలలో మధురిమా
వదులుకోకే వినుమా